కాంగ్రెస్ నేత జీవీ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో (congress leader gv reddy joined in TDP news)పార్టీలో చేరారు. క్రీయాశీలక పార్టీలో చేరాలనే నిర్ణయంతో తెదేపాలో చేరినట్లు జీవిరెడ్డి(gv reddy joined in TDP news) తెలిపారు. చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే.. జగన్ వినాశనం కోరుకునే వ్యక్తి అని విమర్శించారు. రాష్ట్రానికి మరింత నష్టం చేకూరవద్దంటే చంద్రబాబును బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. విజన్ లేకుండా నిధులు పప్పు బెల్లాలు పంచినట్టు పంచితే భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉంటుందన్నారు. కొన్ని వర్గాలు చంద్రబాబుపై అకారణంగా ద్వేషం పెంచుకోవడం వల్ల రాష్ట్రం నాశనమైందని అభిప్రాయపడ్డారు.
'క్రియాశీలక పార్టీలోకి రావాలనే నిర్ణయంతో తెదేపాలో చేరా. చంద్రబాబు అభివృద్ధిని కాంక్షిస్తే.. జగన్ వినాశనం కోరుకునే వ్యక్తి. రాష్ట్రానికి మరింత నష్టం కలగకూడదంటే చంద్రబాబును బలపర్చాలి. విజన్ లేకుండా పప్పుబెల్లాలు పంచినట్టు పంచితే భవిష్యత్ ఉండదు' - జీవీ రెడ్డి
ఇదీ చదవండి:
SAJJALA ON CHANDRABABU: తెదేపా నేతలతో అలా మాట్లాడించింది చంద్రబాబే: సజ్జల