ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఈనెల 15 వరకు 30 యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. పోలీసులు పందిళ్లపల్లిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి: