అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఇతర ప్రభుత్వ శాఖలకు సభ్యత్వం ఇవ్వడాన్ని నిరసిస్తూ... ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టులను సభ్యులుగా చేర్చి, తక్షణమే కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలని జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఇదీచదవండి.