కరోనా వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. కొవిడ్ కేంద్రం వద్ద ఓపీ విభాగాన్ని ఆయన పరిశీలించారు. అత్యవసర విభాగంలోని బెడ్ల వివరాలను ఆరా తీశారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు, వైరస్ సోకిన వారు పెద్ద ఎత్తున జీజీహెచ్‌కు వస్తున్న కారణంగా.. ఆ రద్దీని పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
గిరిజన భవనంలో అత్యవసరంగా 70 పడకలను ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందిని కలెక్టర్ ఆదేశారు. ఆ భవనం నుంచి జి.జి.హెచలోనికి వెళ్లడానికి అడ్డుగా ఉన్న గోడ తొలగించి గేట్లు అమర్చాలని దిశానిర్దేశం చేశారు. కరోనా బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వీలైనంతగా తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ చెప్పారు.
ఇదీ చదవండి: