చిన్న సమస్యలకైనా అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్, హౌసింగ్ అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. 33 వార్డుల్లో ఉన్న విద్యుత్ సమస్యలను కౌన్సిలర్లు, విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చీరాలలో 600 ఇనుప విద్యుత్ స్తంబాలున్నాయని.. వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలు వేయించాలని కౌన్సిలర్లు కోరారు. సభ్యులు అడిగిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎస్ఈ కె.వి.జి సత్యనారాయణ తెలిపారు.
వేటపాలెం మండలం దేశాయిపేటలో 1023 మందికి గృహనిర్మాణాలు ప్రారంభించగా.. కొన్ని పూర్తయినా లబ్దిదారులకు ఇవ్వకపోవటం.. వాటికి విద్యుత్ మీటర్లు బిగించకపోవటంపై ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అసహనం వ్యక్తం చేశారు. లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేకి వినతిపత్రాలు అందజేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఈఈ సూర్యప్రకాష్, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...