ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ప్రజలకు తాను కాపలాదారుడినని.. అప్పుడు తెదేపాలో చేరినా, ఇప్పుడు వైకాపాలో చేరినా ప్రజలకోసమేనని అన్నారు. పందిళ్లపల్లిలోని ఆమంచి నివాసంలో కార్యకర్తల సమవేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన కొంతమంది తమకు అవాంతరాలు సృష్టించారని... ఈవిషయమై సీఎం చంద్రబాబు, మంత్రి లొకేష్ దృష్టికి తీసుకెళ్లినా లాభంలేకపోయిందన్నారు. ఈక్రమంలోనే కార్యకర్తలతో మాట్లాడి వైకాపాలోకి చేరానని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...