ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో తెదేపా కార్యకర్త బసంగారి పద్మ ఆత్మహత్య కేసులో 21 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 25వ తేదీన మృతురాలి తోడికోడళ్లు, కొందరు ప్రత్యర్ధులు కలిసి ఆమెపై దాడిచేసి వివస్త్రను చేశారు. మనస్తాపం చెందిన పద్మ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి...వివాహిత మృతి.. అత్తింటిపనే అని పుట్టింటి ఆరోపణ