ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్.. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. నెల్లూరులో జరిగిన అమ్మఒడి బహిరంగ సభకు ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో సింగరకొండ క్షేత్రానికి వెళ్లారు.
ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రవీణ్ ప్రకాష్‌కు స్వాగతం పలికారు. ధ్వజస్తంభం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీలు చేతన్ మురళీకృష్ణ, ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, తాహసీల్దార్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: