ఆదివారం సందర్భంగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకే చికెన్ విక్రయించాలని చీరాల ఒకటవ పట్టణ సీఐ నాగమల్లీశ్వరరావు చికెన్ సెంటర్ల యజమానులకు సూచించారు. శనివారం సాయంత్రం చికెన్ షాపుల యజమానులతో సీఐ సమావేశం నిర్వహించగా... అందరూ వ్యక్తిగత దూరం పాటిస్తూ పాల్గొన్నారు. వచ్చిన వినియోగదారులను వెంటనే పంపించాలని తెలిపారు. షాపు నిర్వహణలో పని విభజనతోపాటు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే షాపులపై కఠినచర్యలు తీసుకుంటామని చికెన్ షాప్ యజమానులను పోలీసులు హెచ్చరించారు.
'ఉదయం 6 నుంచి 9 వరకే చికెన్ విక్రయం' - cheeral ci on meat markets
లాక్ డౌన్ కారణంగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకే చికెన్ విక్రయించాలని చీరాల సీఐ నాగమల్లీశ్వరరావు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే షాపులపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆదివారం సందర్భంగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకే చికెన్ విక్రయించాలని చీరాల ఒకటవ పట్టణ సీఐ నాగమల్లీశ్వరరావు చికెన్ సెంటర్ల యజమానులకు సూచించారు. శనివారం సాయంత్రం చికెన్ షాపుల యజమానులతో సీఐ సమావేశం నిర్వహించగా... అందరూ వ్యక్తిగత దూరం పాటిస్తూ పాల్గొన్నారు. వచ్చిన వినియోగదారులను వెంటనే పంపించాలని తెలిపారు. షాపు నిర్వహణలో పని విభజనతోపాటు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే షాపులపై కఠినచర్యలు తీసుకుంటామని చికెన్ షాప్ యజమానులను పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి-జిల్లాకు 233 టన్నుల అరటి.. త్వరలో బత్తాయి కూడా!