ప్రకాశం జిల్లా వేటపాలెం న్యూబైపాస్ రోడ్డుపై ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చీరాల ఆర్టీసీ డిపో కండక్టర్ పల్లపోలు శ్రీనివాసరావు మృతిచెందారు. ఈయన చీరాల నుంచి చిన్నగంజాంకు కారులో వెళ్తుండగా ఆ వాహనాన్ని ఒంగోలు నుంచి రేపల్లే వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. గాయపడిన బస్సు డ్రైవర్ను చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి