ETV Bharat / state

గంటలో పెళ్లి.....ఇంతలో వరుడు ఆత్మహత్యాయత్నం - ప్రకాశం జిల్లా నేర వార్తలు

పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ముహూర్తానికి గంట సమయం ఉందనగా గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

bridegroom suicide attempt in prakasam distirct

author img

By

Published : Aug 21, 2020, 8:20 PM IST

ప్రకాశం జిల్లా దర్శి మండలం దేవవరం గ్రామంలో ఓ నవ వరుడు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన అతను... ఆసుపత్రిలో బెడ్​పైన ఉన్నాడు.

దేవవరంలో వాలంటీర్​గా పని చేస్తున్న మరేశ్(23)కు మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ముహూర్తానికి గంట సమయం ఉన్నప్పుడు వరుడు బాత్​రూమ్​లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన దర్శి ప్రభత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.