ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీ భ్రమరాంబ సేవాసమితి సభ్యులు శ్రీశైలం దేవస్థానానికి లక్ష విస్తరాలకు విరాళంగా అందజేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నందున విస్తరాకులను అందించినట్లు సేవాసమితి సభ్యులు చెప్పారు. మహిళలు స్వయంగా చేతితో కుట్టిన విస్తరాకులను ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలకు పంపిస్తున్నట్లు భ్రమరాంబ సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: సంతపేటలో ఆకట్టుకున్న హైడ్రాలిక్ రోబోటిక్ మహా శివుడు