TIFFIN: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో సిబ్బంది మధ్య గొడవతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటలు దాటినా టిఫిన్ రెడీ చేయకపోవడంతో ఆకలితో అలమటించారు.
శనివారం రాత్రి వంట మాస్టర్, వాచ్మన్ గొడవ పడ్డారు. దీంతో వాచ్మన్ వంట గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఉదయం వచ్చిన వంట సిబ్బంది.. గది తాళం లేకపోవడంతో టిఫిన్ సిద్ధం చేయలేదు. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. విద్యార్థులు పరిస్థితిని చూసి సిబ్బంది.. అప్పటికప్పుడు టిఫిన్ చేసి అందించారు.
ఇదీ చదవండి:
Murder: దారుణం... కొడుకు గొంతు కోసి చంపిన తండ్రి... ఎందుకో తెలుసా?