ఎస్సీ యువకుడి మృతి కేసులో చీరాల ఎస్సై విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వాహనంలో తరలించేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోనందుకు బాధ్యుల్ని చేస్తూ... ఈ మేరకు ఐజీ ప్రభాకరరావు చర్య తీసుకున్నారు. మాస్కు పెట్టుకోలేదనే అంశంపై చోటుచేసుకున్న వాగ్వాదం సందర్భంగా... పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే కిరణ్ మరణించాడని బంధువులు ఆరోపించారు. అయితే... స్టేషన్‌కు తరలించే సమయంలో వాహనం నుంచి దూకినందునే తీవ్రంగా గాయపడి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఈ మేరకు ఐజీ చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది..!
అబ్రహం, కిరణ్‌కుమార్ అనే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఆపి, మాస్క్ స్క్‌లేవని నిలదీశారు. ఈ సందర్భంలో యువకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని కానిస్టేబుళ్లు ఎస్సై విజయకుమార్ కు తెలియజేశారు. తర్వాత వారిద్దరినీ జీపులో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం కిరణ్‌కుమార్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని, అపస్మారక స్థితిలో ఉన్నాడని కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించగా, మంగళవారం రాత్రి కిరణ్ మరణించాడు.
దీనిపై ప్రజా, దళిత సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పోలీసులు కొట్టిన దెబ్బలకే కిరణ్ కుమార్ మృతి చెందాడని బంధువులు, వివిధ సంఘాల నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఇదీ చూడండి..