ప్రకాశం జిల్లాలో నెలరోజుల క్రితం ఆరుష్ రెడ్డి అనే బాలుడు అదృశ్యమైన విషయం విదితమే. అయితే ఏలూరు మండలం మాదేపల్లిలో 20 రోజులుగా ఓ మహిళ, పురుషునితోపాటు రెండేళ్ల బాలుడు ఉంటున్నారు. మూడురోజుల క్రితం వారిద్దరు ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారు. వీరి ప్రవర్తనపై స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం రెడ్డినగర్‌లో నెలరోజుల క్రితం అదృశ్యమైన బాలుడు ఆరుష్ రెడ్డి అయి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు విచారణ చేశారు. అదృశ్యమైన బాలుడు ఆరుష్ రెడ్డి ఫోటో చూపించడంతో ఈ బాలుడు కాదని స్థానికులు నిర్ధరించారు. మహిళ, పురుషనితోపాటు ఉన్న బాలుడు ఎవరన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా సిద్ధమే: కళా