రాహుల్ గాంధీపై దాడిని నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం కాంగ్రెస్ నాయకులు భాజపా కార్యాలయం ముందు నిరసన చేశారు. ప్రధాని మోదీ బొమ్మను దగ్ధం చేశారు. దీనిపై నేడు భాజపా నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. తాము లేని సమయంలో కార్యాలయం ముందు ఆందోళన చేయడాన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలో వారు కాంగ్రెస్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు భాజపా నేతల తీరును ఖండించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీపై దాడికి తాము నిరసన చేపట్టామన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులను ప్రోత్సహించడం దారుణమన్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని వారికి సర్దిచెప్పి పంపించారు.
ఇవీ చదవండి..