ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా భారత్​ బంద్

ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దంటూ అఖిలపక్షం తలపెట్టిన భారత్‌ బంద్..‌ ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా జరుగుతోంది. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనివ్వమని, రైతు చట్టాలను రద్దు చేయాలని, వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరలను తగ్గించాలంటూ వీరు డిమాండ్‌ చేశారు.

Bharat Bandh
ప్రకాశం జిల్లాలో భారత్​ బంద్
author img

By

Published : Mar 26, 2021, 3:39 PM IST

ఒంగోలు బస్టాండ్‌ వద్ద వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసి బస్సు సేవలను నిలిపివేసి.. ప్రైవేట్‌ బస్సులను, ఆటోలు తిరగకుండా అడ్డుకుంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసి.. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారన్నారు.

పర్చూరు నియోజకవర్గాల్లో బంద్..

పర్చూరు నియోజకవర్గాల్లో బంద్ సందర్భంగా.. విద్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్​లోని దుకాణాలన్ని మూతపడ్డాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నన్నారు. మోదీ.. ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంక్ లను కూడా ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నాలను తిప్పికొడదాం అని పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ, సీ.ఐ.టీ.యు, సమాజ్ వాదీ పార్టీలు, వివిధ వామపక్ష, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.

యర్రగొండపాలెంలో..

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. యర్రగొండపాలెంలో సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో తెరచిన దుకాణాలను మూసివేయించి.. భారత్ బంద్​కు అందరూ సహకరించాలని కోరారు. పుర విధులలో తిరుగుతూ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించు కోవాలని నినాదాలు చేశారు.

కనిగిరిలో భారత్ బంద్..

కనిగిరిలో భారత్ బంద్ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, తెదేపా, కాంగ్రెస్, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఉదయం 8 గంటల నుండి ర్యాలీగా బయలుదేరి దుకాణాలను, వ్యాపార సంస్థలను , పాఠశాలలను మూయించారు. ముందస్తుగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను డిపోలకే పరిమితం చేశారు. అనంతరం పట్టణంలోని ప్రదాన వీధుల్లో నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు ఎక్కడికక్కడ భద్రత చర్యలు చేపట్టారు.

గిద్దలూరులో బంద్​..

గిద్దలూరులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. పలు వ్యాపార సంస్థలు.. ప్రజా సంఘాలు.. ఆర్టీసీ వారు అందరూ కలిసి భారత్​ బంద్​కు మద్దతుగా నిలిచి విజయవంతం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

మార్కాపురంలో భారత్ బంద్..

మార్కాపురంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్ ప్రభావంతో ఆర్టీసీ బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులు పట్టణంలో తిరుగుతూ.. కార్యాలయాలను మూయించివేశారు.

ఇవీ చూడండి...

వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.