ప్రకాశం జిల్లా బల్లికురవ ఎస్సై, కానిస్టేబుల్.. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ఓ కేసులో సీజ్ చేసిన లారీని వదిలే సమయంలో అవినీతికి పాల్పడిననట్టు తేలినందున.. వారిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు.
సీజ్ చేసిన గ్రానైట్ లారీని విడిపెట్టే క్రమంలో అందులో ఉన్న అసలు గ్రానైట్‌కు బదులుగా నాసిరకం గ్రానైట్‌ను ఉంచినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఎస్సై శివనాంచారయ్య, కానిస్టేబుల్ బాలాజీపై వేటు వేసినట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి:
CS Meeting with IAS officers: 'ఐఏఎస్ అధికారులూ.. సచివాలయానికి రండి!'