ప్రకాశం జిల్లా శింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు దర్శనార్థం వస్తుంటారు. ప్రస్తుతం ఈ క్షేత్రం కొత్త అందాలను సంతరించుకుంది. జిల్లాలోని అద్దంకి-నార్కెట్పల్లి రహదారి పక్కనే దేవస్థానానికి వెళ్లే ముఖద్వారాన్ని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మార్చేశారు. రూ.50 లక్షల సొంత నిధులతో కొత్త నిర్మాణ పనులు చేయించారు. తనయుడు కరణం వెంకటేష్ కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని ముఖద్వారాలను ప్రారంభించారు.
ఇదీ చదవండీ: