ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు కరణం పున్నయ్య చౌదరి, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చెరుకూరి రఘు కిరణ్ , లార్డ్ కృష్ణ భాస్కర్ బాబు బ్యాడ్మింటన్ అకాడమి ఛైర్మన్ శిద్దా సుధీర్ బాబు, కోచ్ భాస్కర్ బాబు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సదుపాయాలతో ఈ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాఘవరావు అన్నారు. జాతీయస్థాయిలో ఎంతోమంది అద్భుతమైన క్రీడాకారులను తయారుచేసిన ఘనత కోచ్ భాస్కర్ బాబుదని మంత్రి అన్నారు. ప్రముఖ క్రీడాకారణికి సైనా నెహ్వాల్ కూడా కొన్ని రోజులు భాస్కర్ వద్ద కోచింగ్ తీసుకున్నారని గుర్తుచేశారు.
ఇవీ చూడండి : 120 ఏళ్ల మహా వృక్షం... ఈదురుగాలలుకు నేలకొరిగింది!