ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఆటోమెటిక్ థర్మల్ స్కానర్ ఏర్పాటు చేశారు. దాదాపు 10 అడుగుల దూరంలో వ్యక్తుల నుంచి ఉష్ణోగ్రతను ఈ మిషన్ స్కాన్ చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్నవారు వస్తే గుర్తించే విధంగా అలారం మోగుతుంది. వెంటనే సిబ్బంది వారిని పక్కకు పంపించి ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. 99 డిగ్రీల లోపు ఉంటే కార్యాలయంలోకి యథావిధిగా వెళ్లిపోవచ్చని అధికారులు తెలిపారు. కలెక్టరేట్లో వివిధ విభాగాలకు వెళ్లే ఉద్యోగులు, సందర్శకులు ఈ స్కానర్ ద్వారా పరీక్షించుకుని లోపలకు రావాలని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ఉండే వివిధ మార్గాలను మూసివేసి, ఒకే మార్గాన్ని తెరిచి, అక్కడ నుంచే రాకపోకలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: అక్రమ కేసులన్నింటికీ జగన్ వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తారు'