ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడు సమీపంలో... అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన ఆటో.. లారీని ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ శివారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శివారెడ్డిని అద్దంకిలో ఆసుపత్రికి తరలించారు. హాస్పటల్ లో చికిత్స పొందుతూ శివారెడ్డి మృతి చెందాడు.
మృతుడు కర్నూలు జిల్లా వాసిగా గుర్తించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సొంత జిల్లాకు వెళ్ళలేక గుంటూరు జిల్లా పెదకంచర్లలో పండ్ల వ్యాపారం చేసే వ్యక్తి వద్ద ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు అతని బంధువులు తెలిపారు.
ఇదీ చదవండి: