ఆ స్వామి తిరునాళ్లలో ఆకట్టుకున్న కులుకు భజన..! - Sri Lakshmi Narasimha Swamy Thirunallu at narava village
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరునాళ్లు మంగళవారం ఘనంగా జరిగాయి. స్వామి వారి దేవాలయం, కొండ వెంబడే ఉన్న రహదారిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన కులుకు భజన... భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.