ETV Bharat / state

సెల్ టవర్ ఎక్కాడు.. చివరికి 'హామీ' సాధించాడు!

ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు.. ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ఎందుకంటే.. ప్రభుత్వ ఉద్యోగం పేరుతో తన దగ్గర నుంచి 7లక్షలు వైకాపా నేత తీసుకుని…అటు ఉద్యోగం..ఇటు తీసుకున్న సొమ్ము రెండూ…ఇవ్వకపోవడంతో ఇంత పని చేశాడు..ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు.

an young man got result attempt to climb a cell tower at last
ఫలించిన సెల్ టవర్ ఎక్కిన యువకుడి ప్రయత్నం
author img

By

Published : Oct 19, 2020, 4:28 PM IST

ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిములపు సురేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజక వర్గంలోని పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. అబ్దుల్ సలాం దేవరాజుగట్టుకు చెందిన యువకుడు... వైకాపా నేత బుజ్జి తనను మోసం చేసినట్టు ఆరోపించాడు. విద్యుత్ శాఖలో షిప్ట్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఆ వైకాపా నేత.. తన వద్ద 7లక్షలు తీసుకున్నట్లు బాధితుడు చెప్పాడు. నగదు తీసుకుని 10 నెలలు గడుస్తున్నా..ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించలేదన్నాడు.

గత కొద్ది రోజులుగా తన నగదు ఇవ్వాలని కోరుతున్నా సమాధానం ఇవ్వడం లేదని యువకుడి బంధువులు చెప్పారు. అప్పు తెచ్చి ఇచ్చామని వాపోతున్నారు. అయితే ఇప్పుడు తనకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చేంతవరకు టవర్ దిగబోనని పైనే భీష్మించుకుర్చున్నాడు. సుమారు నాలుగు గంటల పాటు పైనే ఉన్నాడు. అతన్ని దింపేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఉన్నతాధికారుల సలహా మేరకు యువకుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వగా.. కిందకి దిగాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి:

అద్దెల దరువు ఆగేనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.