కొత్త నిబంధనలతో పింఛను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరానికి చెందిన 83 ఏళ్ల దేవేండ్ల వెంకటమ్మ... ఆమె కుమారుడు లక్ష్మయ్య ఇన్నాళ్లూ పింఛను మీద ఆధారపడి బతికేవారు. లక్ష్మయ్యకు పక్షవాతం రావటంతో మంచానికే పరిమితమయ్యాడు. వీరిద్దరి పేర్లూ ఒకే రేషన్ కార్డులో ఉండటంతో... ప్రభుత్వం పింఛను తొలగించింది. లక్ష్మయ్య కుమారులు, కోడళ్లు కూలి పని చేసుకుని జీవిస్తుండటంతో వీళ్లకు ఆసరా లేకుండాపోయింది. పింఛన్ మీదే ఆధారపడి జీవిస్తున్న వీరిద్దరూ ఇప్పుడు పింఛను రాకపోతే చనిపోవటమే శరణ్యమని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇవీ చదవండి: శ్రీకాకుళంలో.. పొక్లెయిన్ కిందకు వెళ్లి ఓ రైతు ఆందోళన