ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయలక్ష్మీపురంలో దారుణం జరిగింది. ఊరి పెద్దల ఆదేశాలను ఓ కుటుంబం ఉల్లఘించిందని వారి గృహంపై గ్రామస్థులంతా కలిసి ఇటీవల దాడి చేశారు. ఆ ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇంత జరిగినా వారు తీరు మారలేదని మరోసారి దాడికి పాల్పడ్డారు స్థానికులు.
అసలేం జరిగిందంటే?...
చీరాల ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయలక్ష్మీపురంలోని మత్స్యకారులు స్వీయ లాక్డౌన్ ప్రకటించుకున్నారు. కొన్ని రోజులు ఎవరూ ఊరు విడిచి వెళ్లకూడదని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను అతిక్రమించారని లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంటిపై ఈ నెల 22వ తేదీ గ్రామస్థులు దాడి చేశారు. అయినా అతని తీరులో మార్పు రాలేదని మరలా బుధవారం అర్ధరాత్రి లక్ష్మయ్య ఇంటిపై దాడికి దిగారు. బాధితుడి ఇంట్లోని ఫర్నిచర్, కారు, ట్రాక్టర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయలక్ష్మీపురంలో సిబ్బందిని మోహరించారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..