ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్మాణంలో ఉన్న సబ్ జైలును రాష్ట్ర జైళ్ల శాఖ అడిషనల్ డీజీ ఆషన్ రిజా సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. కనిగిరితో పాటు గిద్దలూరులోనూ నూతన జైలు నిర్మిస్తున్నట్లు అడిషనల్ డీజీ తెలిపారు. రాష్ట్రంలో సెంట్రల్ జైళ్లు - 4, జిల్లా జైళ్లు - 8, స్పెషల్ జైళ్లు - 81 ఉన్నాయని చెప్పారు.
యాభై మంది ఖైదీలకు తగ్గకుండా ఉంచేది స్పెషల్ జైలని అన్నారు. అన్నీ జిల్లాలకు కలిపి ఒక కొవిడ్ జైలు కూడా ఉందని తెలిపారు. ఆయన వెంట డీఐజీ వరప్రసాద్, ఐజీ జయవర్థన్ ఉన్నారు.
ఇదీ చదవండి: