ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దారుణం జరిగింది. భార్యకు విద్యుత్‌షాక్ పెట్టి చంపేశాడో ఓ భర్త. శ్రావణి-యోహను దంపతులు ఎస్సీ పాలెంలో నివాసం ఉంటున్నారు. నిత్యం మద్యం సేవించి భార్యతో ఘర్షణ పడేవాడని స్థానికులు తెలిపారు. ఏమైందో ఏమో తెలీదు కట్టుకున్నవాడే రాక్షసంగా హత్య చేశాడు. భార్య మెడకు విద్యుత్ తీగలు బిగించి..షాక్ ఇచ్చీ మరీ హతమార్చాడు. అనంతరం కుటంబసభ్యులతో సహా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..దారుణం.. తల్లిని నరికి చంపిన తనయుడు