నేనున్నానంటూ అన్నీ తానై ఆకలి, దప్పులతో అలమటించిపోతున్న జంతువులకు తనవంతు సహాయం చేస్తున్నాడు ఓ యువకుడు. ప్రకాశం జిల్లా కనిగిరి అంటేనే మెట్ట ప్రాంతం, మనుషులకే తాగడానికి నీరు దొరకని పరిస్థితి. పైగా వేసవి కాలం వచ్చిందంటే భరించలేని ఉక్కపోతతో సతమతమవుతుంటారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో కొండ ప్రాంతంలో నివసించే వానరాల, పక్షుల దాహార్తి వర్ణించలేనిది. కనీసం తినడానికి తిండి లేక గొంతు తడుపుకోవడానికి నీరు లేక అలమటిస్తూ, ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితిని గమనించిన కనిగిరి యువకుడు శ్రీరామ్.. వాటికి ఆకలిని తీరుస్తున్నాడు.
గత నాలుగు సంవత్సరాలుగా..కనిగిరికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనున్న కొండ ప్రాంతంలోని కోతులకు, పక్షులకు నిత్యం పండ్లు, క్యాన్లతో నీళ్లను తీసుకొని వెళ్తున్నాడు. తన మిత్రులతో కలిసి కొండెక్కి వానరాలకు సేవ చేస్తున్నాడు. కొందరు ఆకతాయిలు కొండ ,అటవీ ప్రాంతాలకు నిప్పుపెట్టి కాల్చి వేస్తున్నారని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఆ ప్రాంతాలలోని చెట్లు, వృక్షాలు పూర్తిగా కాలిపోవడంతో పక్షులు వానర జాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయని వాపోతున్నాడు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు యువకులు ముందుకువచ్చి అంతరించిపోతున్న పర్యావరణాన్ని, జంతు జాతులను పరిరక్షించుకుందామని వేడుకుంటున్నాడు.
ఇదీ చూడండి.
తిరుమల కనుమదారిలో పొగమంచు హోయలు