అద్దంకి వద్ద రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - road accident news
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొంగపాడు డొంక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో అద్దంకికి చెందిన ప్రేమానంద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... అతని భార్య సుమిత్రకు తీవ్ర గాయాలయ్యాయి. భార్యాభర్తలిద్దరూ అద్దంకి నుంచి మణికేశ్వరం వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన సుమిత్రను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అద్దంకి వద్ద స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఇదీ చదవండి: పొగాకు పంట దగ్ధం... రైతుకు భారీ నష్టం