ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని భవాని కూడలి వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పంచర్లు చేసే వర్క్ షాప్లో షాక్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు... మంటలార్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సుమారు రూ.50 వేలు విలువైన సామగ్రి కాలిపోయినట్లు దుకాణ యజమాని మౌలాలి వాపోయాడు.
ఇదీ చదవండి: ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల