ETV Bharat / state

కోటంరెడ్డి, అనిల్ కుమార్ భేటీ.. నెల్లూరు రాజకీయాల్లో చర్చ! - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వార్తలు

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని సజ్జపురంలో మాజీమంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకాంతంగా భేటీ అయ్యారు. మంత్రి పదవుల విషయమై అంసృప్తిలో ఉన్న ఇరువురు నేతలు సమావేశం కావటం జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది.

అనిల్ కుమార్
అనిల్ కుమార్
author img

By

Published : Apr 14, 2022, 6:44 PM IST

మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి భేటీ రాజకీయ చర్చకు దారితీసింది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని సజ్జపురంలో ఇరువురూ సమావేశమయ్యారు. భేటీలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మంత్రి వర్గంలో తనకు స్థానం దక్కలేదని ఇటీవల కోటంరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు మంత్రి వర్గం నుంచి తనను తప్పించి జిల్లా నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డిని కేబినెట్​లోకి తీసుకోవటం.., ప్రమాణస్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని మీడియా ముందు అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం విధితమే. ఇవాళ్టి నేతల భేటీలో భవిష్యత్తు రాజకీయాలు, నెల్లూరు రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల విషయమై అసంతృప్తిలో ఉన్న ఇరువురు నేతలు భేటీ కావటం జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది.

ఇవీ చదవండి:

తాజా మాజీల తొలి రోజు ఎలా ఉందంటే..

Kotamreddy Sridhar Reddy: మంత్రివర్గంలో కోటంరెడ్డికి దక్కని చోటు.. ఆవేదనతో కంటతడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.