నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు వద్ద(Youngster died at nellore)... కలుజు వాగులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరిని స్థానికులు కాపాడారు. నెల్లూరు నుంచి స్వగ్రామం చెర్లో వంగల్లుకు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు కలుజు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరద ప్రవాహానికి ద్విచక్రవాహనం నీటిలో పడిపోయింది. గమనించిన స్థానికులు.. అతికష్టం మీద ఇద్దరిని కాపాడారు. గల్లంతైన యువకుడు నీటిలో మునిగి చనిపోయాడు.
ఇదీ చదవండి