ETV Bharat / state

అత్తింటి వేధింపులు..ఆపై కరోనా..మనస్తాపంతో యువతి ఆత్మహత్య - crime news nellore

పిల్లలు పుట్టలేదని..అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వేధింపులు ఒకవైపు.. మరోవైపు కరోనా సోకటంతో నిరాదరణకు గురైన ఓ యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

young women sucide at nellore
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
author img

By

Published : Jul 5, 2020, 10:07 AM IST

నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ యువతికి సమీప బంధువుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరు మనుమసిద్ధి నగర్​లో ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. ఈ కారణంతో కొంతకాలంగా అత్తింటి వేధింపులు మెుదలయ్యాయి. ఇదే క్రమంలో ఆమె సమీప బంధువులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు కూడా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలడంతో అత్తింటి వారి నిరాదరణకు గురైంది.

శనివారం భర్త, కుటుంబ సభ్యులు కావలి వెళ్లగా.. అ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి మనస్తాపంతో పురుగుల మందు తాగింది. కావలి వెళ్లిన మృతురాలి భర్త పలుమార్లు ఆమెకు ఫోన్ చేసినా ఎత్తకపోవటంతో హుటాహుటిన నెల్లూరుకు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె మృతి చెందింది. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకీకరణకు నిధులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.