నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని రవితేజ కళ్యాణమండపంలో ఎన్నికలపై వైకాపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కార్యకర్తలతో సమీక్షించారు. నియోజకవర్గంలో తెదేపా నుంచి వైకాపాలోకి చేరిన వారికి ఆహ్వానం పలికారు. జరగనున్న ఎన్నికల్లో మొదటి నుంచి పార్టీకి సేవ చేసిన వారికి పదవులు ఇస్తామని మంత్రి భరోసానిచ్చారు. గెలిచివారు ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మొదటిసారి అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేలా మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పనిచేసి జరగబోయే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా.. ఈ నిబంధనలు పాటించాల్సిందే!