ETV Bharat / state

VIRAL: ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రలోభాల పర్వం..

VIRAL: ఆత్మకూరు ఉపఎన్నిక సమీపిస్తుండడంతో ప్రలోభాలకు తెరతీశారు. నేటితో ప్రచారం ముగియనుండటంతో తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో విజయం నల్లేరుపై నడకగా భావిస్తున్న వైకాపా అత్యధిక ఆధిక్యం సాధించడంపై దృష్టి పెట్టింది.

VIRAL
ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రలోభాల పర్వం
author img

By

Published : Jun 21, 2022, 8:40 AM IST

VIRAL: ఆత్మకూరు ఉపఎన్నిక సమీపిస్తుండడంతో ప్రలోభాలకు తెరతీశారు. నేటితో ప్రచారం ముగియనుండటంతో తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో లేకపోవడం.. దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో విజయం నల్లేరుపై నడకగా భావిస్తున్న వైకాపా అత్యధిక ఆధిక్యం సాధించడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం రాష్ట్రంలోని మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో.. గత కొన్ని రోజులుగా వారు ప్రచారం ముమ్మరం చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో మండలాల బాధ్యతలను తీసుకున్న కొందరు ఇప్పటికే ఆయా గ్రామాల్లో నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. కొందరు వాలంటీర్ల ద్వారా కూడా డబ్బు పంపిణీ చేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం ఓజిలి మండలానికి చెందిన కొండవల్లిపాడు గ్రామ సర్పంచి కొండూరు ప్రభాకర్‌రాజు సంగంలో ప్రచారం చేశారు. ఓటుకు రూ.500 చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి డబ్బు ఇస్తూ వైకాపా అభ్యర్థిని ఆశీర్వదించాలని చేతులు పట్టుకొని అభ్యర్థిస్తున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.