పురపాలక ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టి ఫలితాలు సాధించుకున్న సీఎం జగన్కు తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా గెలుపుతో కనువిప్పు కలిగించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సైదాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన..తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్లమెంట్లో ఎంతో అనుభవం ఉన్న పనబాక లక్ష్మి విజయంతోనే తిరుపతి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెదేపా అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.
ఇదీచదవండి
'వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి'