ETV Bharat / state

ఆస్పత్రిలో సిబ్బంది లేమి.. బల్లపైనే ప్రసవం - నెల్లూరు జిల్లా వార్తలు

పేరుకే 24 గంటల ఆసుపత్రి. అనునిత్యం అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది.. రాత్రయితే ఒక్కరూ ఉండరు. ఫలితంగా అత్యవసర వైద్యం కోసం వస్తున్న రోగులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవలసిన పరిస్థితి. తాజాగా.. ఇలాంటి ఉదంతమే జరిగింది. జిల్లాలోని వరికుంటపాడుకు చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బల్లపైనే ప్రసవించింది. ఈ ఘటనలో తల్లీ బిడ్డా సురక్షితంగా ఉండటంతో బాధిత కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

Woman Delivered A baby on table in nellore Hospital
ఆస్పత్రిలో సిబ్బంది లేమి.. బల్లపైనే ప్రసవం
author img

By

Published : Jul 15, 2020, 7:16 PM IST

ఆస్పత్రిలో సిబ్బంది లేమి.. బల్లపైనే ప్రసవం

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వరికుంటపాడు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో సిబ్బంది ఎవరూ లేకపోవడం, నొప్పులు తీవ్రమైన పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో అక్కడే ఉన్న బల్ల పై మహిళ ప్రసవించింది.

ఈ ఘటనతో బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురైంది. అత్యవసర సేవల కోసం వస్తే.. సిబ్బంది లేని కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

ఇదీ చదవండి:

శ్రీవారి దర్శనాలపై తీవ్ర ప్రభావం చూపుతోన్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.