నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మోడల్ కాలనీలో యాకయ్య - నాగమణి దంపతులు, వారి ఇద్దరు పిల్లలు నివసించేవారు. నాగమణికి మతిస్థిమితం సరిగా ఉండేది కాదు. ఫలితంగా.. కుటుంబం మొత్తానికి యాకయ్యే ఆధారంగా ఉండేవాడు. రోజు కూలీ పని చేసుకునే యాకయ్య.. ఇటీవల చనిపోయాడు. మతి స్థిమితం సరిగా లేని నాగమణికి.. భర్త మరణించిన విషయం అర్థం కాలేదు. పిల్లలు కూడా ఆమెకు విషయాన్ని చెప్పలేకపోయారు. మూడు రోజులు అలా.. యాకయ్య శవం పక్కనే నాగమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చివరికి విషయాన్ని గుర్తించిన స్థానికులు.. ఐక్య ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఆ సంస్థ ప్రతినిధులు యాకయ్యకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఇల్లు కదల్లేని నాగమణి, ఆమె పరిస్థితి ఏంటన్నది.. ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ చదవండి: