ETV Bharat / state

ప్రియుడి మోజులో భర్తను హతమార్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..! - భర్తను హతమార్చిన భార్య న్యూస్

వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో భార్య. ఆపై ప్రియుడితో కలిసి.. ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ ఘటన గురించి.. ఆ మహిళ గురించి... పోలీసులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఎంతలా అంటే.. రాత్రి సమయంలో భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మరీ ప్రియడితో కలిసి ఆమె ఏకాంతంగా గడిపేదని తెలిపారు.

wife murder husband at nellore over illegale afire
ప్రియుడి మోజులో భర్తను హతమార్చి...రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి
author img

By

Published : Jul 12, 2021, 10:34 PM IST

ప్రియుడి మోజులో భర్తను హతమార్చి...రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హతమార్చిందో భార్య. ప్రియుడి సహాయంతో ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. చివరకు పోలీసులకు చిక్కింది. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ నెల 7న జరిగిన హత్య కేసు వివరాలను రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి వెల్లడించారు. కోవూరు మండలం కొత్తూరు హరిజనవాడలో రవీంద్ర, సమత దంపతులు జీవనం సాగిస్తున్నారు. రవీంద్ర ఓ చర్చిలో పాస్టర్​ కాగా.. సమత గ్రామ వాలంటీర్​గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా రాము అనే వ్యక్తితో సమత అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. భార్య ప్రవర్తనను గమనించిన రవీంద్ర.. ఆమెను పలుమార్లు మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాకపోగా.. భర్త హత్యకు పథకం వేసింది.

ప్రియుడితో కలిసి..

రాత్రి సమయంలో భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మరీ.. సమత ప్రియుడితో ఏకాంతంగా గడిపేదని పోలీసులు వెల్లడించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రవీంద్రను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించినట్లు తెలిపారు. ఈనెల 7న ప్రియుడి సహాయంతో ఊపిరాడకుండా చేసి భర్తను హతమార్చినట్లు డీఎస్పీ తెలిపారు.

రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం

రవీంద్రను హత్య చేసిన సమత..ఆ నేరం తనపై రాకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రియుడి సహాయంతో కోవూరు జాతీయ రహదారిపైకి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శవపరీక్షలో.. రవీంద్ర ఊపిరాడకపోవటం వల్లే మృతి చెందాడని వైద్యులు రిపోర్టు ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా నిర్ధరించుకున్న పోలీసులు... ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. భయపడిపోయిన సమత, ఆమె ప్రియుడు రాము.. ఇవాళ కోవూరు తహసీల్దార్ ఎదుట లొంగిపోయారు.

ఇదీ చదవండి:

Baby Dead: భార్యపై అనుమానంతో.. తొమ్మిది నెలల బాలుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.