నెల్లూరు నగరంలోని జాకిర్హుస్సేన్నగర్కి చెంది షేత్ ఫయాజ్‌కి కళ్యాణితో 2007లో వివాహం జరిగింది. కొంతకాలంగా భర్త ఫయాజ్ మద్యం తాగి వచ్చి భార్య కల్యాణిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. విసుగు చెందిన కల్యాణి అతనిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. అందుకు కరీముల్లా అనే వ్యక్తిని ఆశ్రయించింది.
పక్కా ప్లాన్ ప్రకారం..
ఈనెల 22వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫయాజ్‌పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రోకలి బండతో దాడి చేశారు. అనంతరం చనిపోయాడని భావించి అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు సమాచారంతో ఇంటికి వచ్చిన భార్య, కుటుంబసభ్యులు.. తీవ్రంగా గాయపడిన ఫయాజ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మృతి చెందాడు. కేసు నమోదు చేసిన నవాబుపేట పోలీసులు విచారణ జరిపి.. భార్యే ఫయాజ్ మృతికి కారణం అని తేల్చారు. నిందితులైన భార్య కళ్యాణి తోపాటు కరీముల్లా, ప్రసాద్, మల్లి, ప్రకాశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండీ.. నెమ్మదించిన కొవిడ్ రెండో దశ.. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రణాళికలు