గత పదిహేనేళ్ల నుంచి ఆ గ్రామంలో ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులే పాలిస్తున్నారు. వారు చేస్తున్న ఇన్నేళ్లనుంచి ఆ ఇంటివారికి సర్పంచి పీఠాన్ని కట్టబెడుతున్నారు. వాళ్లు చేసిన అభివృద్ధితోనే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరు గ్రామాన్ని పదిహేనేళ్లుగా భార్యాభర్తలే పాలిస్తున్నారు. మొత్తం 900 మంది జనాభాలో 720 మంది ఓటర్లున్నారు. గ్రామానికి చెందిన బొడ్డు నరసింహులునాయుడు 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. ఆ తర్వాత 2013లో జరిగిన పోరులో ఆయన భార్య బొడ్డు జయమ్మ 11 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాజా(2021) ఎన్నికల్లోనూ జయమ్మ ఏకగ్రీవంగా సర్పంచి అయ్యారు.
భార్యాభర్తల హయాంలో గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.55 లక్షలతో జడ్పీ పాఠశాలకు అదనపు గదులు నిర్మించారు. మరో రూ.60 లక్షలతో సిమెంటు రోడ్లు వేయించారు. ఇంకో రూ.50 లక్షలతో మురుగు కాలువలు ఏర్పాటు చేయించారు. ఈ దఫా రైతులు పొలాలకు వెళ్లడానికి వీలుగా మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని దంపతులు తెలిపారు. రూ.20 లక్షలతో అసంపూర్తిగా డ్రైనేజీ, ముస్లిం శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: