ETV Bharat / state

పల్లె గొంతెండుతోంది... జనానికి నరకం కనబడుతోంది! - మహిమలూరు

ఒక వైపు భూగర్భజలాలు ఎండిపోతున్నాయి....మరోవైపు బోర్లు, బావుల్లో నీరు అడుగింటిపోతుంది...బిందె నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి...గుక్కెడు నీరు దొరక్క కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరు వాసుల నీటి కష్టాలకు నిలువెత్తు నిదర్శనం.

నెల్లూరు జిల్లా మహిమలూరు
author img

By

Published : Jun 2, 2019, 8:25 PM IST

పల్లె గొంతెండుతోంది...!

భూగర్భ జలాలు ఎండిపోయి భూమిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల... బోర్లు, బావుల్లో నీరు అడిగింటిపోతున్నాయి. ఈ పరిస్థితితో తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు ప్రజలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు ఎస్సీ కాలనీ, బండ్లపల్లి ఖాన్ సాహెబ్ పేట, రామస్వామి పల్లి గ్రామాలలో గుక్కెడు నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బిందె నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళలేని వారు నీటిని డబ్బులు పెట్టి కొనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మహిమలూరు గ్రామంలో సుమారు 3000 మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ నీటి అవసరాలు తీర్చేందుకు నాలుగు ట్యాంకులు ఉన్నాయి. వాటిలో నీరు మాత్రం లేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉన్న రెండు ట్యాంకుల్లో నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. మిగతా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా.. పది రూపాయలు క్యాను కొనుక్కుని మరీ వాడుకుంటున్నారు.

ఈ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. నీళ్లు రాకపోయినా కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా తమ ప్రాంతాలకు సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని బాధిత ప్రజలు వేడుకుంటున్నారు.

ఇవి చదవండి...దూకుడు పెంచుదాం... దరి చేరుదాం!

Intro:ap_cdp_17_02_kadapa_lo_bhari_varsham_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఉక్కపోతతో అల్లాడుతున్న కడప నగర వాసులకు కాస్త ఊరట లభించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మురికి కాలువలు పొంగి ప్రవహించాయి. రోడ్లపై మోకాలు లోతు వరకు నీరు నిల్వ ఉన్నాయి.

Body:కడప లో భారీ వర్షం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.