ETV Bharat / state

Walkers Association ఈ వాకర్స్ అసోసియేషన్ తీరే వేరు..! పేద క్రీడాకారులను ఆదుకుంటూ..సేవామార్గంలో ! - AC Subbareddy Stadium

Walkers Association: అనేక సంఘలు వారి హక్కుల కోసం. వారి డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు అవుతుంటాయి. సమాజ సేవలో మేము భాగస్వామ్యంగా ఉంటామని ముందుకు వచ్చే సంస్థలు, సంఘాలు చాలా తక్కువగా ఉంటాయి. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ మాత్రం రాష్ట్రంలో ఓ ప్రత్యేక గుర్తింపును పొందింది. అందులో ఉన్న సభ్యులందరూ ప్రముఖ వైద్యులు. లెక్టరర్స్, అనేక ఉద్యోగాలు చేసేవారు. పదవీ విరమణ చేసిన వారు ఎక్కువగా సేవ చేస్తారు. వ్యాపారులు ఆర్థికపరమైన ఆలోచనలు ఇస్తారు. విభిన్నంగా ఈ అసోసియేషన్ 28ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తుంది.....

Walkers Association
Walkers Association
author img

By

Published : Jun 8, 2023, 7:55 PM IST

Updated : Jun 8, 2023, 8:13 PM IST

Walkers Association : నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అంటే రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో తెలియని వారు లేరని చెప్పాలి. ఈ స్టేడియానికి నిత్యం వాకింగ్ కు వచ్చే వారు వేలాది మంది ఉంటారు. వాకర్స్ తో, క్రీడాకారులతో నిత్యం కళకళలాడే ఈ స్టేడియం నిర్వాహణకు వాకర్స్ అసోసియేషన్ ను 1994లో ఏర్పాటు చేశారు. ఇందులో శాశ్వత సభ్యులు 1450మంది ఉన్నారు. నిర్వహణ కోసం మరో ఐదువేల మంది పనిచేస్తారు. పేద క్రీడాకారులను ప్రోత్సహించడం. వారికి పౌష్టికాహారం అందించడం. విద్యార్ధులకు ఫీజులు, పుస్తకాలు ఇవ్వడం వంటివి చేస్తారు. పాఠశాలలకు, కళాశాలలకు సెలవు రోజుల్లో, సమ్మర్ శిక్షణకు వచ్చే వందలాది మంది విద్యార్ధులకు ప్రతి రోజు వీరు పౌష్టికాహారం పంపిణీ చేస్తారు. గ్రౌండ్ లోనే స్టేజి మీద యువక్రీడాకారులకు ఏదో ఒక పండు, గుడ్డు, చిక్కీలు, పాలు అందిస్తారు. ప్రత్యేక సమయాల్లో పేద క్రీడాకారులకు భోజనం వసతి ఏర్పాటుచేస్తారు.

ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఎంతమంది విద్యార్ధులు మైదానానికి వచ్చినా ఆహారం అందిస్తున్నారు. 1500మందికి ప్రస్తుతం మైదానంలో పంపిణీ చేస్తున్నారు. వాకర్స్ అసోసియేషన్ లో ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు, రిటైర్ అయిన వారు వారి జీతం, పింఛన్ నుంచి అసోసియేషన్ కు నెలకు కొంత నగదు అందిస్తారు. వేసవి శిక్షణా శిభిరంలో 10లక్షల రూపాయలకు పైగా పౌష్టికాహారానికి ఖర్చు చేస్తారు. పేద విద్యార్ధులకు ఫీజులు ఆరోగ్యానికి నగదు కావాలంటే మైదానంలో రింగ్ లో నిలబడి సహాయంకోరితే ఎంత కావాలో అంత అందజేస్తారు.

మైదానంలో దుమ్ములేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లి క్రీడాకారులకు సహకారం అందిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలైన వాకర్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యాక్రమాలను నిర్వహిస్తామని ధీమాగా చెబుతున్నారు. బైట్ 3. తిరుపతినాయుడు గౌరవ అధ్యక్షుడు.

పేదల కోసం మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారు. క్లబ్ లో పనిచేసే కార్పోరేట్ వైద్యులు ఉచిత క్యాంప్ లకు సహకరిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడు ఎక్కడా లేడు, సహాయంచేసే వారిలోనే ఉన్నారని వీరు అందరికీ చెబుతున్నారు.

అసోసియేషన్ ఏర్పడి దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంలో ప్రతి సంవత్సరం మే నెలలో 16 క్యాంపుల్లో భాగంగా దాదాపు 1000 మంది శిక్షణ పొందుతుంటారు. అలాంటి క్రీడాకారులకు పౌష్టిక ఆహారం అందించే ఒక మంచి ఆలోచనతో ప్రారంభించిన కార్యక్రమం ఇప్పటికి నిర్విరామంగా కొనసాగుతోంది. - రఘురామ్ ముదిరాజ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం

ఏసీ సుబ్బారెడ్డి అసోసియేషన్ 1994లో పెట్టారు. దాదాపు ఈ అసోసియేషన్​లో 1650 క్లబ్బులు ఉన్నాయి దేశీయ అంతర్జాతీయ పోటీల్లో మా అసోసియేషన్ కే రావడం సంతోషమైన విషయంయ దీనితో పాటు ఎంతో మందికి,ఎన్నో రకాలుగా సేవలు చేయటమే మాకు తృప్తి -కిలారి తిరుపతి నాయుడు, గౌరవ అధ్యక్షులు

రెండున్నర దశాబ్దాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలు

Last Updated : Jun 8, 2023, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.