ఈటీవీ భారత్ అందించిన సమాచారంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈవీఎలు ర్యాండమైజేషన్ చేసినప్పటి స్లిప్పులు కావొచ్చని వివరణ ఇచ్చారు. నిబంధనలు మేరకు ర్యాండమైజేషన్ స్లిప్పులనూ భద్రపరచాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
కలెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న ఆర్డీవో బృందం ఆత్మకూరు పాఠశాలకు చేరుకుంది. పలు కవర్లలో ఉన్న వీవీ ప్యాట్ స్లిప్పులు ఆర్డీవో బృందానికి దొరికాయి. ఘటనకు సంబంధించి స్థానికాధికారుల వివరణ కోరుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల సంఘం తీరుపై జాతీయస్థాయిలో పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు... ఈ స్లిప్పుల వ్యవహారంపైనా అనుమానాలు లేవనెత్తుతున్నారు.