నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాలెంలో ఉద్యాన సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ అరటి, కూరగాయ, వరి పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకోవాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు. ఈ నెల 15లోపు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: