Gadapa Gadapa Program: నెల్లూరు జిల్లా మర్రిపాడులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సొంత మండలంలో నిరసన సెగ తగలింది. చాబోలులో సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందకపోవడంపై మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి అభివృద్ధి కార్యక్రమాలేవీ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పుకోబోయిన మహిళలను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు.
ఇవీ చదవండి