ఆత్మకూరు పట్టణంలోకి కరోనాతో పాటు ఇతర ఏ అంటువ్యాధులు ప్రవేశించకుండా.. ఉన్న రోగాలు కూడా గ్రామం నుంచి వెళ్లిపోవాలని కోరుతూ రక్షణ తోరణాలు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మ.. దగ్గరుండి మరీ ఈ తోరణాలను ప్రతీ వీధిలో కట్టించారు. తోరణంపై పసుపు వస్త్రాన్ని అమ్మవారి ప్రతిమగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఆ దేవత రక్ష.. ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రజలపై ఎప్పుడూ ఉండాలని.. కరోనా మహమ్మారి గ్రామం నుంచి వెళ్లిపోవాలని అమ్మవారిని కోరుతున్నట్టు వెంకటరమణమ్మ తెలిపారు.
15వ వార్డులోని గ్రామ దేవత దేవాలయం వద్ద అమ్మవారు ఒంట్లో పూని దేవత చెప్పిన ప్రకారం పట్టణ శివారులో వీధి వీధికి కాలనీవాసులు రక్షా తోరణం ఏర్పాటు చేశారు. నిమ్మకాయలను, వేప మండలను గడ్డితో చుట్టి ప్రతి వీధిలో తోరణంగా కట్టారు. ఆ తోరణంపై పసుపు, కుంకుమ కలిపిన వస్త్రాన్ని అమ్మవారి ప్రతిమగా పెట్టారు. అనంతరం తమ గ్రామాన్ని కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని స్థానిక ప్రజలు అమ్మవారిని వేడుకున్నారు.
ఇవీ చూడండి...