నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం యువత గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా సేవలు అందిస్తోంది. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పని చేస్తున్నారు. వలస కార్మికులకు.. పట్టణాల శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఉచిత భోజన సదుపాయాలు అందించారు. ప్రస్తుతం పట్టణాలకన్నా, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అవసరమని గుర్తించి.. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పని చేస్తున్నారు. కాకుటూరు గ్రామంలో కరోనా పాజిటివ్ వ్యక్తులను గుర్తించి వారికి జాగ్రత్తలు వివరించడంతోపాటు, మందులు అందజేశారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు మందులు పంపిణి చేశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జాతీయసేవా పథకం (ఎన్.ఎస్.ఎస్)విభాగంలో ఉన్న యువత నిరంతరం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు....
ఇవీ చదవండి: ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని భాజపా ఆందోళన