నెల్లూరు జిల్లాలో పురుగుమందుల దుకాణాలపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో నిషేధిత కలుపుమందులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో ఈ దాడులు నిర్వహించారు. ఇప్పటివరకు 15వేల లీటర్ల నిషేధిత కలుపు మందు విక్రయించినట్లు అధికారులు గుర్తించి రికార్డులు సీజ్ చేశారు.
నెల్లూరుతోపాటు కావలి, ఉదయగిరి, ఎ.ఎస్.పేట, దగదర్తి మండలాల్లో దాడులు జరిగాయి. కోవూరులో విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి, ఏడిఏ ధనుంజయరెడ్డిలు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత కలుపు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.